Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీమతిగా నివేదా.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్..

శ్రీమతిగా నివేదా.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్..

V6 Velugu 6 hrs ago

'35 చిన్న కథ కాదు' చిత్రంలోని వైఫ్‌ క్యారెక్టర్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా థామస్‌.. మరోసారి గృహిణిగా కనిపించబోతోంది. ఆమె లీడ్ రోల్‌లో రూపొందుతున్న చిత్రం 'శ్రీమతి'.

బుధవారం ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశారు.

మూవీ టైటిల్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 'ప్రతి ఇంటి హృదయం నుంచి ఒక కథ పుడుతుంది.. అది మనందరికీ తెలిసిన, మనం ప్రేమించే.. మనం జీవించే కథ' అంటూ క్యాప్షన్‌ జోడించారు.

టైటిల్‌కు తగ్గట్టే మిడిల్ క్లాస్‌ వైఫ్‌ గెటప్‌లో తన లుక్‌ ఆకట్టుకుంది. ఓ సాధారణ గృహిణి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఎదురయ్యే సవాళ్లు, కుటుంబ భావోద్వేగాల చుట్టూ జరిగే కథ ఇదని అర్థమవుతోంది. 'స్కైలాబ్‌' ఫేమ్‌ విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News