Dailyhunt
సికింద్రాబాద్లో ట్రామా కేర్ వర్క్షాప్..పాల్గొన్న 200 మంది యువ డాక్టర్లు

సికింద్రాబాద్లో ట్రామా కేర్ వర్క్షాప్..పాల్గొన్న 200 మంది యువ డాక్టర్లు

V6 Velugu 1 week ago

ద్మారావునగర్, వెలుగు: ట్రామా కేసుల నిర్వహణలో నేటి యువ డాక్టర్లకు ప్రాక్టికల్​శిక్షణతో కూడిన వర్క్​ షాపులు ఎంతో ఉపయోగపడతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

సోమవారం సికింద్రాబాద్​లో మెడికవర్ హాస్పిటల్స్, ఉస్మానియా మెడికల్ కాలేజీతో పాటు పలు ఆర్థోపెడిక్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో 'పెల్విక్​-ఎసిటాబ్యులమ్ అడ్వాన్స్డ్ ట్రామా కేర్'పై జాతీయ స్థాయి వర్క్​షాప్ నిర్వహించారు.

సుమారు 200 మంది యువ ఆర్థోపెడిక్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమంలో క్లిష్టమైన శస్త్రచికిత్సలపై క్యాడావర్ (మృతదేహాల) ద్వారా ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన తొలి ఆరు గంటల్లో పెల్విక్ గాయాలకు అందించే చికిత్స అత్యంత కీలకమని, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News