Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింగరేణిలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి..ఆగస్ట్‌లో 106 శాతం ఉత్పత్తి..వరుసగా మూడు నెలలు  టార్గెట్ రీచ్

సింగరేణిలో పెరిగిన బొగ్గు ఉత్పత్తి..ఆగస్ట్‌లో 106 శాతం ఉత్పత్తి..వరుసగా మూడు నెలలు టార్గెట్ రీచ్

V6 Velugu 4 days ago

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. ఎల్‌నిన్‌ ఎఫెక్ట్‌తో సరిగా వానలు పడకపోవడంతో నిరంతరాయంగా ఉత్పత్తి కొనసాగింది. దీంతో వరుసగా మూడు నెలలు జూన్​, జూలై, ఆగస్ట్‌ నెలల్లో నూరు శాతానికిపైగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించింది.

గతేడాది ఇదే టైమ్​లో వర్షాల వల్ల ఓపెన్​ కాస్టుల్లో రోజుల తరబడి ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ సారి ఆగస్ట్‌లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 40,39,392 టన్నులు కాగా 106శాతంతో 42,82,288 టన్నులు, జూలైలో 40,36,300 టన్నుల ఉత్పత్తికి గానూ 103శాతంతో 41,71,128 టన్నులు, జూన్‌లో 42,08,894 టన్నుల లక్ష్యానికి గానూ 102శాతంతో 42,90,180 టన్నులు ఉత్పత్తి సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News