Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోషల్ మీడియా వేదికగా దుష్ర్పచారం : స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సోషల్ మీడియా వేదికగా దుష్ర్పచారం : స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

V6 Velugu 2 weeks ago

ఫర్‌గఢ్/స్టేషన్​ఘనపూర్, వెలుగు: బీఆర్‌ఎస్‌ లీడర్లు సోషల్​మీడియా ద్వారా కాంగ్రెస్​ప్రభుత్వంపై అబద్ధపు, విష ప్రచారం చేస్తున్నారని స్టేషన్​ఘన్‌పూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు.

జఫర్‌గడ్ మండలం సాగరం గ్రామంలో రూ.2.26కోట్లతో నిర్మించిన 33/11కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌కు రూ.1400కోట్ల పార్టీ ఫండ్​ ఉందని, ఇదంతా అక్రమమని కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే ధైర్యం ఆ పార్టీ లీడర్లకు ఉందా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్ల ప్రాజెక్టు కూడా తేలేని బీజేపీ, అసలు తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించిందన్నారు. రెండేళ్లలోనే సాగరం గ్రామానికి దాదాపు రూ. 10 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. గ్రామంలోని దంసా చెరువుకు ఏడాది పొడవునా నీళ్లు ఉండేలా ఉప్పుగల్‌-పాలకుర్తి కెనాల్‌పై షట్టర్​ఏర్పాటు చేసి, ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ నూకల ఐలయ్య, సర్పంచ్​ మమత, చైతన్యకుమార్, లీడర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News