Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సౌత్‌ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో.. నార్త్‌ జోన్‌ 256/7

సౌత్‌ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో.. నార్త్‌ జోన్‌ 256/7

V6 Velugu 5 hrs ago

బెంగళూరు: సౌత్‌ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో నార్త్‌ జోన్‌ 139 రన్స్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. సనత్‌ సాంగ్వాన్‌ (76), ఆయూష్‌ డోసెజా (52) హాఫ్‌ సెంచరీలు చేయడంతో..

మంగళవారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌కు నార్త్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 256/7 స్కోరు చేసింది. నిశాంత్‌ సింధు (20 బ్యాటింగ్‌), అన్షుల్‌ కాంబోజ్‌ (29 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

ఆయూష్‌ బదోనీ (31) ఫర్వాలేదనిపించాడు. నిదీశ్‌, సాయితేజ, శ్రేయస్‌ గోపాల్‌ తలా రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 285/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 312 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (116 నాటౌట్‌) మెరుగ్గా ఆడాడు. గుర్నూర్‌ బ్రార్‌ 4 వికెట్లు పడగొట్టాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News