Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టాక్ మార్కెట్లో మిక్స్‌డ్ ట్రెండ్.. లాభాల్లో సెన్సెక్స్, నష్టాలతో నిఫ్టీ ప్రారంభం

స్టాక్ మార్కెట్లో మిక్స్‌డ్ ట్రెండ్.. లాభాల్లో సెన్సెక్స్, నష్టాలతో నిఫ్టీ ప్రారంభం

V6 Velugu 2 weeks ago

ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం, అమెరికా కంపెనీల ఆదాయాలపై పెట్టుబడిదారుల దృష్టి పెట్టిన క్రమంలో భారత స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 493.94 పాయింట్లు పెరిగి 79వేల 132 దగ్గర ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 70 పాయింట్లు తగ్గి 24వేల703 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది.

ప్రారంభ ట్రేడింగ్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు లాభాల్లో కొనసాగాయి. ఎన్‌ఎస్‌ఈలో 1,379 స్టాక్స్ లాభాల్లో ఉండగా, 1,115 స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 109 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

గిఫ్ట్ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో ప్రారంభం కావడం మార్కెట్‌కు సానుకూల సంకేతాలిచ్చింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) వరుసగా ఆరో సెషన్‌లోనూ కొనుగోళ్లు కొనసాగించారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) కూడా మార్కెట్‌లో కొనుగోళ్లకు మద్దతు ఇచ్చారు.

మరోవైపు ఆసియా మార్కెట్లు మాత్రం ఒత్తిడిలో కనిపించాయి. జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా కోస్పి సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చైనా షాంఘై సూచీ మాత్రం స్వల్ప లాభాల్లో కొనసాగింది. ముడి చమురు ధరల తగ్గుదల, గ్లోబల్ మార్కెట్ల పరిణామాలు భారత మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News