Dailyhunt
సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి...10 మంది వైద్య సిబ్బంది మృతి

సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి...10 మంది వైద్య సిబ్బంది మృతి

V6 Velugu 3 weeks ago

కైరో: సూడాన్‌లో అంతర్యుద్ధం రోజురోజుకూ భయానకంగా మారుతోంది. దక్షిణ-మధ్య ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై గురువారం జరిగిన డ్రోన్ దాడిలో సుమారు10 మంది మృతి చెందినట్లు వైద్య బృందం పేర్కొంది.

పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) వైట్ నైల్ ప్రావిన్స్‌లోని అల్-జబలైన్ ఆసుపత్రిపై రెండు సార్లు డ్రోన్ దాడులు జరిపిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ తెలిపింది.

ఈ దాడుల్లో ఆపరేషన్ థియేటర్, ప్రసూతి వార్డు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈ ఘటనలో ఏడుగురు వైద్య సిబ్బంది సహా మొత్తం 10 మంది మృతి చెందగా, మరో 19 మంది గాయపడ్డారు.

గాయపడిన వారిని కోస్తి పట్టణ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. 2023 ఏప్రిల్‌లో సూడాన్ అంతర్యుద్ధం ప్రారంభం కాగా, ఇప్పటివరకు 200కిపైగా ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగాయని డబ్ల్యూహెచ్​వో తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News