Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తాడ్వాయి: వన దేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు ఏర్పాటు

తాడ్వాయి: వన దేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు ఏర్పాటు

V6 Velugu 1 week ago

తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలోని సమ్మక్క గద్దె ముందు గతంలో జువ్వి చెట్టు ఉండేది. అనాది నుంచి వచ్చిన ఆనవాయితీ, ఆచారం ప్రకారం భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాక ఆ జువ్వి చెట్టు వద్ద సేద తీరి గద్దల వద్దకు చేరుకొని, ముక్కులు తీర్చుకునేవారు.

కాలక్రమేనా ఆ చెట్టు ఎండిపోవడంతో బుధవారం ఎండోమెంట్ ఆఫీసర్లు, పూజారులు, వాట్ ఆర్ ఫౌండేషన్ సమక్షంలో పాత చెట్టు ఉన్న స్థలంలో ట్రీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా మరో కొత్త జువ్వి చెట్టును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి, సిబ్బంది, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News