Dailyhunt
టాప్‌-2లోనే అభిషేక్‌, ఇషాన్‌

టాప్‌-2లోనే అభిషేక్‌, ఇషాన్‌

V6 Velugu 2 weeks ago

దుబాయ్‌: ఇండియా స్టార్‌ బ్యాటర్లు అభిషేక్‌ శర్మ (875 రేటింగ్ పాయింట్లు), ఇషాన్‌ కిషన్‌ (871).. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-2 ర్యాంక్‌లను నిలబెట్టుకున్నారు.

బుధవారం విడుదలైన తాజా లిస్ట్‌లో అభి, ఇషాన్ తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ (742), సూర్యకుమార్‌ యాదవ్‌ (722) వరుసగా 6, 7 ర్యాంక్‌ల్లో ఉన్నారు. సంజూ శాంసన్‌ (637).. 20వ ర్యాంక్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్‌ కానర్‌ ఎస్టర్‌హుజెన్‌ 64 ప్లేస్‌లు ఎగబాకి 39వ ర్యాంక్‌ సాధించాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో 200 రన్స్‌ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలవడం కానర్‌కు కలిసొచ్చింది. ఇంగ్లండ్‌ వెటరన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ (716) ఒక ప్లేస్ మెరుగై 8వ ర్యాంక్‌లో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో రషీద్‌ ఖాన్‌ (753), వరుణ్‌ చక్రవర్తి (740) తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు. జస్‌ప్రీత్‌ బుమ్రా (702) ఐదో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ (649) ఒక్క ర్యాంక్‌ మెరుగుపడి 16వ ర్యాంక్‌లో నిలవగా, అక్షర్‌ పటేల్‌ (639) 18వ స్థానంలో ఎలాంటి మార్పులేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News