Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా EV కార్లకు అనూహ్యంగా పెరిగిన డిమాండ్ : నెల నుంచి 3 నెలల వరకు వెయిటింగ్..!

టాటా EV కార్లకు అనూహ్యంగా పెరిగిన డిమాండ్ : నెల నుంచి 3 నెలల వరకు వెయిటింగ్..!

V6 Velugu 6 days ago

భారత ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో దూసుకుపోతున్న తీరు, దానికి వస్తున్న డిమాండ్ ఆసక్తికరంగా మారింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వాటాను వేగంగా పెంచుకుంటోంది.

గత ఆరు నెలల్లో కంపెనీకి వచ్చే ఈవీ బుకింగ్‌లు ఏకంగా మూడు రెట్లు పెరిగాయని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెల్లడించారు. అలాగే మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న కంపెనీకి, టాటాకు మధ్య దూరం మరింత పెరిగిందని ఆయన తెలిపారు.

కార్లకు మార్కెట్లో ఊహించని స్థాయిలో విపరీతమైన డిమాండ్ వస్తున్నప్పటికీ, ఆ స్థాయిలో కార్లను తయారు చేసే ఉత్పత్తి సామర్థ్యం (Production Capacity) సరిపోకపోవడమే ప్రస్తుతం మాకు ఉన్న ఏకైక పరిమితి అని ఆయన పేర్కొన్నారు. అంటే డిమాండ్‌ ఉన్నప్పటికీ అన్ని కార్లను వెంటనే అందించలేకపోతున్నామని చెప్పారు.

సెప్టెంబర్ - డిసెంబర్ మధ్య వచ్చే పండుగ సీజన్ అమ్మకాలు ఆటోమొబైల్ రంగానికి చరిత్రలోనే అతిపెద్ద త్రైమాసికంగా నిలిచే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. గత త్రైమాసికంలోనూ పరిశ్రమ మొత్తం మీద 46 శాతం వృద్ధిని సాధించగా, ఒక్క ఈవీల విభాగమే 77 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

గత ఏడాది అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కార్ల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీ కొనసాగుతుండగా, చిన్న కార్లపై 18 శాతానికి పన్ను తగ్గింది. ఈ పన్ను సంస్కరణల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని, కొత్త కార్ల లాంచ్‌లతో కలిపి ఇది పండుగ సీజన్‌కు మరింత ఊపునిస్తోందని తెలిపారు.

టాటా మోటార్స్ సెప్టెంబర్‌లో కార్ల ధరలను పెంచుతున్నప్పటికీ, పండుగ సీజన్ డిమాండ్ పై దీని ప్రభావం పెద్దగా ఉండదని, పండుగలు ముగిసిన తర్వాతే దీని ప్రభావం ఎలా ఉంటుందనేది స్పష్టమవుతుందని శ్రీవత్స అన్నారు.

►ALSO READ | ఆపిల్ కొత్త సీఈవో జాన్ టర్నల్ జీతం ఎన్ని వందల కోట్లో తెలుసా.. !

పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభం, ఇంధన ధరల ప్రభావం వల్ల ప్రజలు పెట్రోల్, డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్రత్యామ్నాయ ఇంధన కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా, భారతీయులు ఫ్యామిలీతో కలిసి రోడ్డు ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుండటం కూడా కార్ల విక్రయాలు పెరగడానికి ఒక కారణమని ఆయన వివరించారు.

టాటా ఎలక్ట్రిక్ వాహనాలకు, సెలెక్టెడ్ మోడల్, బ్యాటరీ ప్యాక్ ఇంకా వేరియంట్‌ను బట్టి 1 నుండి 24 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

మోడల్ వారీగా వెయిటింగ్ పీరియడ్ వివరాలు

*Tata Tiago EV: స్మార్ట్ 19, ప్యూర్ + 19 వంటి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లకు 18 నుండి 24 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇతర వేరియంట్‌లకు తక్కువ సమయం, అంటే 4 నుండి 6 వారాలు పడుతుంది.
*Tata Punch EV: స్మార్ట్ 30 వంటి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌లకు 18 నుండి 24 వారాల సమయం పడుతుండగా, Smart 40కి 10 నుండి 12 వారాలు, ఇతర వేరియంట్‌లకు 8 నుండి 10 వారాల సమయం పడుతుంది.
*Tata Sierra EV: ప్యూర్ 65 వేరియంట్ డెలివరీకి 12 నుండి 15 వారాల సమయం పడుతుంది, కాగా ఇతర వేరియంట్లు 4 నుండి 6 వారాల్లో అందుబాటులో ఉంటాయి.
*Tata Curvv EV: ఈ మోడల్ కార్ సుమారు 1 నుండి 2 వారాల కంటే తక్కువ డెలివరీ కాలవ్యవధితో తక్షణమే అందుబాటులో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News