Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ రక్షణ సేన  భూపోరాట సభ.. కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

తెలంగాణ రక్షణ సేన భూపోరాట సభ.. కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

V6 Velugu 3 weeks ago

ప్పల్ బగాయత్‌లో తెలంగాణ రక్షణ సేన (TRS) తలపెట్టిన 'భూ పోరాట సభ' కు పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఈ సభ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు.

సభకు అనుమతి లేకపోవడంతో, నిర్వాహకులు మరియు వివిధ ప్రాంతాల కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల బొల్లి గూడెం ఇండస్ట్రియల్ ఏరియాలో తెలంగాణ రక్షణ సేన భూ పోరాట సభ నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రక్షణ సేన భూ పోరాటాన్ని పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సభ స్థలంలో వేసిన టెంట్లు పోలీసులు తొలగిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News