Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ సచివాలయంలో ఏసీబీ సోదాలు..

తెలంగాణ సచివాలయంలో ఏసీబీ సోదాలు..

V6 Velugu 1 hr ago

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. సెక్రటేరియట్ ఆవరణలోని టెంపుల్ దగ్గర లంచం తీసుకుంటుండగా ఒకరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

దొరికిన వ్యక్తి మరొక వ్యక్తి పేరు చెప్పడంతో ప్రస్తుతం ఒక అధికారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. మరొక అధికారి ఉన్నట్టు సమాచారం. ఇంకా సెక్రటేరియట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అధికారి రెండు లక్ష రూపాయలకు గాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్ వినోద్తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రలను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి అధికారులు విచారిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News