టెలికాం రంగంలో స్పామ్, కస్టమర్ సమ్మతి నిర్వహణపై దేశంలో నూతన నియంత్రణ విధానాల అవసరం పెరిగింది. ఒకప్పుడు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వినియోగదారులు ఇచ్చే అనుమతి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు.
కాలక్రమేణా కస్టమర్ల ప్రాధాన్యతలు మారినప్పటికీ.. కంపెనీలు పాత ఇంటరాక్షన్ ఆధారంగానే ప్రమోషనల్ సందేశాలు పంపుతుండటం సమస్యగా మారింది.
ప్రస్తుత డిజిటల్ సమ్మతి విధానంలో కన్సెంట్ రికార్డుల ధృవీకరణ అంతా అప్‌స్ట్రీమ్‌లో ఒరిజినటింగ్ యాక్సెస్ ప్రొవైడర్స్ వద్ద జరుగుతోంది. కానీ వినియోగదారుడితో నేరుగా సంబంధం ఉండి స్పామ్ ఫిర్యాదులను పరిష్కరించే టెర్మినటింగ్ యాక్సెస్ ప్రొవైడర్ - అనగా కస్టమర్ స్వంత టెలికాం ఆపరేటర్ - వద్ద ఈ రికార్డులపై పూర్తి నియంత్రణ ఉండటం లేదు. ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్‌లిస్ట్ అయిన 32,095 ఎంటిటీలలో దాదాపు 87 శాతం కేవలం రెండు OAP ఆపరేటర్లకు చెందినవి కావడం ఈ నిర్మాణ లోపాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ లోపాలను సవరించేందుకు "TAP-led DCA" విధానాన్ని అమలు చేయడం అత్యవసరం. ఈ నమూనా కింద వినియోగదారుడి టెలికాం ఆపరేటరే కన్సెంట్‌ను సేకరించడం, ధృవీకరించడం, అమలు చేయడం వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది. వాణిజ్య సందేశాలు కస్టమర్‌కు చేరే ముందే ఆ ఆపరేటర్ ప్రస్తుత ప్రాధాన్యతలు, నిరాకరణలు, ఫిర్యాదుల హిస్టరీని రియల్ టైంలో పరిశీలిస్తుంది. దీనివల్ల కస్టమర్ రక్షణ బాధ్యతను నిర్వర్తించే ఆపరేటరుకే కన్సెంట్ అమలు చేసే పూర్తి అధికారం లభిస్తుంది.
ఈ విధానం ద్వారా బాధ్యత, అధికారాలు ఒకే చోట కేంద్రీకృతమై కస్టమర్ల ప్రయోజనాలు నెరవేరుతాయి. పాత హిస్టారిక్ రికార్డులకు బదులుగా కస్టమర్ ప్రస్తుత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రియల్ టైం డేటా ఉపయోగించటం సాధ్యమవుతుంది. సున్నితమైన సమాచారం కస్టమర్‌కు సమీపంలో భద్రపరచబడుతుంది కాబట్టి డేటా భద్రత మెరుగవుతుంది. డిజిటల్ కమ్యూనికేషన్ విస్తరిస్తున్న తరుణంలో, వినియోగదారుల నమ్మకం పాత రికార్డులపై కాకుండా.. నేడు సబ్‌స్క్రైబర్ ఏం కోరుకుంటున్నారనే దానిపైనే ఆధారపడి ఉండాలి.

