Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీచర్ల సమస్యలపై రేపు తపస్ మహాధర్నా

టీచర్ల సమస్యలపై రేపు తపస్ మహాధర్నా

V6 Velugu 3 weeks ago
  • పీఆర్సీ ప్రకటించాలని, డీఏలు రిలీజ్ చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య తెలిపారు.

51 శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీ ప్రకటించాలని, 6 పెండింగ్ డీఏలతో పాటు ఈ-కుబేర్‌లో నిలిచిపోయిన బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.

హెల్త్ కార్డుల పేరుతో ప్రతి నెలా జీతాల్లో కోత విధిస్తున్నా, కార్పొరేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హామీ మేరకు 2003 డీఎస్సీవారికి పాత పెన్షన్ అమలు చేయాలని, మేనిఫెస్టోలో చెప్పినట్టు సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కేజీబీవీ, ఎస్ఎస్ఏ మహిళా సిబ్బందికి సమ్మె కాలపు జీతం చెల్లించి ఎంటీఎస్ అమలు చేయాలని, 2008 డీఎస్సీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మోడల్ స్కూల్స్, గురుకులాల్లో 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News