Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌ పై నిషేధం ఎత్తివేత

టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌ పై నిషేధం ఎత్తివేత

V6 Velugu 3 weeks ago

తిరువనంతపురం: టీమిండియా మాజీ పేసర్‌ ఎస్‌. శ్రీశాంత్‌కు ఊరట కలిగింది. కేరళ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేసీఏ) గతంలో విధించిన మూడేళ్ల నిషేధాన్ని ఎత్తి వేసింది.

ఈ మేరకు బుధవారం జరిగిన కేసీఏ ప్రత్యేక జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్‌ తెలిపింది. 'శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించాం.

అదే సమయంలో, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ఆయనను హెచ్చరించాం' అని కేసీఏ ప్రకటనలో పేర్కొంది. కేసీఏపై తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ బేషరతు క్షమాపణలు చెప్పడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్) మ్యాచ్‌లకు ముందు సామాజిక మాధ్యమాల్లో కేసీఏ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడటంతో శ్రీశాంత్‌పై ఈ నిషేధం పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News