Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ తనిఖీలు : దేవుడి పేరుతో కోట్లు సంపాదించారనే సమాచారంతో..!

తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ తనిఖీలు : దేవుడి పేరుతో కోట్లు సంపాదించారనే సమాచారంతో..!

V6 Velugu 1 week ago

తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇళ్లపై ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంతో పాటు ఏకకాలంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

లోకనాథంతో పాటు తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ, తిరుమలలోని ఆయన అధికారిక కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలోనూ సోదాలు జరుగుతుండటం సంచలనం సృష్టిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News