Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్

తిరుమల కొండపై ఆధిపత్యపోరు వల్లే లోకనాథంపై ఏసీబీ దాడులు : భూమన సంచలన కామెంట్స్

V6 Velugu 1 week ago

తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందని.. అధికారులపై ఏసీబీ దాడులు చేయిస్తూ.. అణచివేసే కుట్ర నడుస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.

తిరుమల చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని.. ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత నీచమైన రాజకీయం కొండపై లేదంటూ చెప్పుకొచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. 2026, సెప్టెంబర్ 2వ తేదీన.. టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్ ఇంట్లో ఏసీబీ తనిఖీల తర్వాత భూమన మీడియాతో మాట్లాడారు.

తిరుమల కొండపై ఉన్న అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందని.. కొంత మంది అధికారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని.. ఇందులో టీటీడీ చైర్మన్, ఈవో రవిచంద్ర పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్ పై ఏసీబీ దాడుల వెనక కుట్ర కోణం ఉందని స్వయంగా వెల్లడించారు భూమన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తిరుమలలో 80 మంది అధికారులను ఆరు నెలలు విచారణ చేశారని.. అయినా ఏమీ తేల్చలేదన్న విషయాన్ని వెల్లడించారు భూమన. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని విధంగా తిరుమలలో పరిపాలన ఉందని.. ఇంత దుర్మార్గమైన.. నీచమైన రాజకీయం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్ తాత, తండ్రులు కోటీశ్వరులు అని.. లోకనాథం కుటుంబం ఎప్పటి నుంచో ధనవంతులు అని చెప్పుకొచ్చారు భూమన. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా స్వామి సేవలో ఉన్న లోకనాథం వంటి ఆఫీసర్ ను టార్గెట్ చేయటం వెనక భారీ కుట్ర కోణం ఉందంటూ తీవ్రమైన కామెంట్స్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండపై ఎంతో నిబద్దతో పనులు చేస్తున్న వాళ్లల్లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం అని.. వాళ్లిద్దరిని అణిచివేసే కుట్రలో భాగంగానే.. చైర్మన్, ఈవో కలిసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.

ALSO READ : తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ తనిఖీలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 80 మంది అధికారులను వివిధ కారణాలతో ఆరు నెలలు విచారణ చేసినా ఎలాంటి ఫలితం లేదని.. ఇప్పుడు మళ్లీ లోకనాథం లాంటి వాళ్లను అణచివేసేందుకు ఏసీబీ పేరుతో దాడులు చేయిస్తున్నారని.. ఇప్పటికైనా టీటీడీ ఉద్యోగులు ఈ విషయంలో తిరగబడాలని పిలుపునిచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండ పవిత్రతను, విశిష్ఠతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని.. ఈ అంశంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు భూమన కరుణాకర్ రెడ్డి. నిజాయితీ అధికారులపై మచ్చలు వేస్తాం.. అణచివేస్తాం అంటూ ఆ కలియుగ దేవుడు చూస్తూ ఉండడని.. సరైన సమయంలో గుణపాఠం చెబుతాడని.. దేవుడి కోపానికి అనుభవిస్తారంటూ చెప్పుకొచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News