Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trisha: త్రిషకు షాపింగ్ షాక్.. చెమట కంపు కొట్టే బట్టలు పంపిన ZARA బ్రాండ్!

Trisha: త్రిషకు షాపింగ్ షాక్.. చెమట కంపు కొట్టే బట్టలు పంపిన ZARA బ్రాండ్!

V6 Velugu 2 weeks ago

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిషకు వింత అనుభవం ఎదురైంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా (Zara)పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. లేటెస్ట్గా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షాపింగ్ అనుభవం గురించి రియాక్ట్ అయింది.

ఆన్లైన్లో డ్రెస్సెస్ ఆర్డర్ పెడితే.. డెలీవరీ చేసే ముందు కనీసం చెక్ చేయరా? పార్సిల్ ఓపెన్ చేయగానే బట్టల నుంచి భరించలేని చెమట వాసన రావడం ఏంటీ అని త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఇలా జరగడం ఇది మూడోసారి అని చెబుతూ 'డెలివరీ అయిన దుస్తుల నుంచి శరీర దుర్వాసన రావడం చాలా అసహ్యంగా ఉందంటూ' త్రిష ఫైర్ అయింది.

త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ..''డియర్ జారా, ఇది ఒక చిన్న విజ్ఞప్తి మాత్రమే. ఇకపై హోమ్ డెలివరీ కోసం పంపే దుస్తుల నుంచి శరీర దుర్వాసన రాకుండా చూసుకోండి. అది స్వల్పంగా ఉన్నా కూడా అసహ్యంగానే ఉంటుంది. వరుసగా మూడోసారి ఇదే సమస్య ఎదురవుతోంది. కనీసం ప్యాక్ చేసే ముందు వాటిని ఒకసారి వాసన చూసి పంపండి'' అని త్రిష తనదైన శైలిలో రాసుకొచ్చింది.

ALSO READ : NTR for LENIN: నాగ్ మాస్టర్ ప్లాన్.. అఖిల్ కోసం రంగంలోకి ఎన్టీఆర్?

అయితే త్రిష చేసిన ఈ ఆరోపణలపై ఇప్పటివరకు జారా సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదిలా ఉంటే, గతకొంతకాలంగా త్రిష పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తోంది. తమిళనాడు సీఎం విజయ్‌తో రిలేషన్ లో ఉన్నట్లు మొదలు.. కరుప్పు సక్సెస్ వరకు. ఇలా ఏదోవిధంగా త్రిష వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News