Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుమ్మిడిహెట్టి సాధ్యం కాలేదనే మేడిగడ్డకు మార్పు : బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ జీవన్‌రెడ్డి

తుమ్మిడిహెట్టి సాధ్యం కాలేదనే మేడిగడ్డకు మార్పు : బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ జీవన్‌రెడ్డి

V6 Velugu 3 weeks ago

హైదరాబాద్‌, వెలుగు: 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందం కుదరలేదని బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ టి.

జీవన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ 152 మీటర్లకు అంగీకరించలేదని పేర్కొన్నారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రతో చర్చలు జరిపినా ఫలితం రాలేదన్నారు. తుమ్మిడిహెట్టి సాధ్యం కాకపోవడంతోనే ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 40 టీఎంసీల నీటి లభ్యత ఉంటే, మేడిగడ్డ వద్ద 240 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వేగంగా పూర్తైన ప్రాజెక్టుల్లో ఒకటని చెప్పారు. ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని, వాటి విలువ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 0.5 శాతం మాత్రమేనని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News