హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ , లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానుల కోసం రాచకొండ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీపి సుధీర్ బాబు పర్యవేక్షణలో సుమారు 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల, వెలుపల ఏకంగా 430 సిసి కెమెరాలతో క్షణక్షణం నిఘా పెట్టామన్నారు.
మ్యాచ్ టికెట్స్ ఉన్న వారు మాత్రమే స్టేడియం పరిసరాలకు రావాలని పోలీసులు స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. వాహనాల కోసం 11 పార్కింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచారు.
స్టేడియంలోకి వెళ్లేటప్పుడు ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లు, బ్యానర్లు , ఇతర పదునైన వస్తువులపై పూర్తి నిషేధం విధించారు. స్టేడియం వద్ద ఎటువంటి క్లాక్ రూమ్ సౌకర్యం లేదు. కాబట్టి ప్రేక్షకులు తమ బ్యాగులను, నిషేధిత వస్తువులను ఇంటి వద్దే ఉంచి రావాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ బరిలోకి దిగిన లక్నో ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News