Dailyhunt
Vadam OTT: 'వడమ్' రివ్యూ.. ఎద్దుల పోటీతో రూరల్ యాక్షన్ డ్రామా.. సినిమా ఎలా ఉందంటే?

Vadam OTT: 'వడమ్' రివ్యూ.. ఎద్దుల పోటీతో రూరల్ యాక్షన్ డ్రామా.. సినిమా ఎలా ఉందంటే?

V6 Velugu 2 weeks ago

మిళ నటుడు విమల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ వడమ్. కేందిరన్ వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటరాజ్ కీలక పాత్ర పోషించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, ప్రస్తుతం Sun NXTలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో వేమల్ ఒక గ్రామీణ యువకుడిగా కనిపిస్తాడు. అతను ఒక కంటి చూపు లేని ఎద్దును శిక్షణ ఇచ్చి పోటీల్లో ముందుకు తీసుకెళ్తాడు. ఈ విజయాన్ని చూసి ప్రత్యర్థి (నటీ నటరాజ్) అసూయపడతాడు.

ఈ క్రమంలోనే హత్య చేయడం, పశువుల దొంగతనం, ప్రతీకారం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సనాష్క శ్రీ, మునిష్కాంత్, ఆదుకలం నరేన్, మధుసూదన్ రావు, దీపా శంకర్, బాల సరవణన్, ఇంధుమతి మనికందన్ తదితరులు నటించారు.

కథేంటంటే:

ఈ సినిమా తమిళనాడులోని సంప్రదాయ క్రీడ 'వడ మంజు విరాట్టు' (ఎద్దుల పోటీ) నేపథ్యంలో సాగుతుంది. రత్నవేల్ (నట్టి నటరాజ్) పోటీలకు పనికిరాదని భావించి ఒక ఒంటి కన్ను దూడను వధకు పంపిస్తాడు. అప్పుడు వెట్రివేల్ (విమల్) తండ్రి సంతానవేల్ (నరేన్) ఒక చెక్‌పాయింట్ దగ్గర దాన్ని కాపాడతాడు.

వెట్రి దానికి 'పాండిముని' అని పేరు పెట్టి, సొంత బిడ్డలా చూసుకుంటాడు. ట్రైనింగ్‌ ఇచ్చి ఎంతటి ఎద్దునైనా ఓడించగల చాంపియన్‌గా తీర్చిదిద్దుతాడు. మరోవైపు రత్నవేల్ కూడా తన ఎద్దుని పోటీలకు రెడీ చేస్తాడు.

►ALSO READ | ఇది కదా గౌరవం: 'బైకర్' సక్సెస్‌తో శర్వా ఎమోషనల్.. థియేటర్‌ స్క్రీన్‌కు సాష్ఠాంగ నమస్కారం!

అయితే.. అతనికి తన ఎద్దు ఎప్పుడూ ఓడిపోకూడదనే అహంకారం ఉంటుంది. కానీ.. ఒక పోటీలో రత్నవేల్ ఎద్దుపై వెట్రి ఎద్దు పాండిముని విజయం సాధించడంతో అతనికి అవమానంగా అనిపిస్తుంది. అప్పటినుంచి రత్నవేల్ వెట్రిపై పగ పెంచుకుని ఇబ్బంది పెడుతుంటాడు. అతని నుంచి వెట్రి తన ఎద్దును, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే?

వడమ్ ఒక సాధారణ గ్రామీణ కథ అయినప్పటికీ, ఎమోషనల్ డ్రామా మరియు సంప్రదాయ క్రీడ నేపథ్యంలో ఆసక్తికరంగా తెరకెక్కింది. ఎద్దుల పోటీ సన్నివేశాలు రియలిస్టిక్‌గా ఉండటం, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. సినిమాకు డి ఇమ్మన్ అందించిన సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News