Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vaishali Nagar Trafic curbs: వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ ట్రాఫిక్ ఆంక్షలు..సెప్టెంబర్16 వరకు పొడిగింపు

Vaishali Nagar Trafic curbs: వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ ట్రాఫిక్ ఆంక్షలు..సెప్టెంబర్16 వరకు పొడిగింపు

V6 Velugu 4 days ago

హైదరాబాద్ సిటీ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించారు ట్రాఫిక్ పోలీసులు. రైల్వే అండర్ పాస్ రోడ్డు విస్తరణ పనులు, మురుగునీటి కాల్వ పనులు ఇంకా పూర్తి కానందున సెప్టెంబర్ 3నుంచి సెప్టెంబర్ 16 వరకు మరో 14 రో జులు ట్రాఫిక్ ఆంక్షలు పొడిగించారు.

అటుగా వెళ్లే ప్రయాణికులు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉందని, వర్షాలు పడితే మురుగు నీరు చేరి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని గతంలో ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు ఇచ్చిన ఫిర్యాదుతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు వెడల్పు విస్తరణ పనులను చేపట్టింది. దీంతో జూలై 16 నుంచి 29 రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ్టతో ఆ గడువు ముగిసింది. ఇంకా రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో మరోసారి ఆంక్షలు పొడిగించారు.సెప్టెంబర్ 3నుంచిసెప్టెంబర్ 16 వరకు 14 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలనిసైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచించారు.

ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు..

హఫీజ్‌పేట్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను.. మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్స్ నుంచి అండర్‌పాస్ ద్వారా మళ్లిస్తారు. మై హోమ్ మంగళ టిజంక్షన్ -రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు యు-టర్న్-రాఘవేంద్రనగర్ కాలనీ జంక్షన్, హై-టెన్షన్ రోడ్ దగ్గర ఎడమవైపుకు -కొండాపూర్‌లోని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కార్యాలయం దగగర ఎడమవైపు-హఫీజ్‌పేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) మీదుగా హఫీజ్‌పేట్‌కు చేరుకునేలా ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది.

తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ రోడ్ నుంచి అండర్‌పాస్ వైపు వెళ్లే వాహనాలను.. మై హోమ్ మంగళ టిజంక్షన్ -రాఘవేంద్రనగర్ కాలనీ-హై-టెన్షన్ రోడ్-కొండపూర్ రోడ్- హఫీజ్‌పేట్ ఆర్‌ఓబి లేదా ఫ్లైఓవర్ -హఫీజ్‌పేట్ ,ఆల్విన్ జంక్షన్‌ కు ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సైబరాబాద ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News