Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరదల విధ్వంసం మరువక ముందే.. టిబెట్లో భారీ భూకంపం

వరదల విధ్వంసం మరువక ముందే.. టిబెట్లో భారీ భూకంపం

V6 Velugu 9 hrs ago

నేపాల్, టిబెట్ లాంటి మంచు దేశాలలో ఇటీవల వచ్చిన వరదల విధ్వంసానికి సంబంధించిన ఆనవాళ్లు చెరిగిపోక ముంతే.. టిబెట్ లో భారీ భూకంపం సంభవించింది. 2026 అక్టోబర్ 22న రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో వచ్చిన భూకంపంతో దేశంలో పలు ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి.

10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. టిబెట్ రాజధాని ల్హాసాకు 400 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు చైనా భూకంప కేంద్రం (CENC) వెల్లడించింది.

నేపాల్-చైనా బార్డర్ లో వరదలు విలయతాండవం చేసి 1400 మందిని బలిచేసిన కొన్ని వారాలలోనే భూకంపం సంభవించడం స్థానికంగా భయాందోళనలకు గురిచేసే అంశం.

భారీ భూకంపానికి జనాలు భయాందోళనలతో ఇండ్లను వదిలి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత భారీ కుదుపులు ఉండటం సహజం. అయితే ఆస్తి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News