Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెరైటీ టైటిల్తో కీర్తి సురేష్‌ కొత్త సినిమా..

వెరైటీ టైటిల్తో కీర్తి సురేష్‌ కొత్త సినిమా..

V6 Velugu 2 weeks ago

బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్. ఓవైపు స్టార్‌ హీరోలకు జంటగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటిస్తోంది.

ఆమె లీడ్ రోల్‌లో ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'డొరోతి'. కీర్తి సురేష్‌తో పాటు సనంత్, రిషికాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. బుధవారం ఈమూవీ టీజర్‌ను విడుదల చేశారు. హీరో ధనుష్‌ టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు.

రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన ఇద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మధ్య జరిగే కథ ఇదని టీజర్‌తో అర్థమవుతోంది. వీరి జీవితంలోకి కీర్తి సురేష్ పాత్ర వచ్చాక ఏం జరిగింది అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌గా కనిపిస్తోంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ గత చిత్రాల తరహాలో డిఫరెంట్‌ మేకింగ్ స్టైల్‌తో ఈ సినిమా ఉండబోతోందని టీజర్‌లో చూపించారు. ఎక్కువగా హీరోలిద్దరి విజువల్స్‌ చూపించగా, చివర్లో చీరకట్టులో ఆకట్టుకుంది కీర్తి సురేష్‌.

అంతేకాక టైటిల్‌ గురించి ఈ ముగ్గురు మాట్లాడుకోవడం ఆసక్తి రేపింది. 'డొరోతి' అంటే గిఫ్ట్ ఆఫ్‌ గాడ్‌ అనే అర్థముంది. జియో స్టూడియోస్‌ సమర్పణలో జ్యోతి దేశ్‌పాండే, గునీత్‌ మొంగా కపూర్‌, అచిన్ జైన్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న సినిమా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News