Dailyhunt
వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరించాలంటూ విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరించాలంటూ విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

V6 Velugu 3 weeks ago

మెదక్ (చేగుంట), వెలుగు: వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లిలో ఓ యువకుడు విద్యుత్తు హై టెన్షన్ టవర్‌ ఎక్కాడు.

గ్రామానికి చెందిన ప్రదీప్​ తనకు వీఆర్‌ఏ ఉద్యోగం ఇవ్వాలని అప్పటివరకు తాను కిందకు దిగనని భీష్మించాడు. తూప్రాన్​ డీఎస్పీ నరేందర్‌గౌడ్‌, చేగుంట ఎస్సై చైతన్య కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకొని కిందకు దిగాలని ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు.

పోలీసులు, గ్రామస్తులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​చైర్మన్‌ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి పోలంపల్లికి చేరుకుని వీఆర్ఏ వ్యవస్థ గురించి అసెంబ్లీలో మాట్లాడుతానని చెప్పారు. దీంతో ప్రదీప్​ టవర్ పై నుంచి కిందకు దిగాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News