Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యాశాఖ మంత్రిని నియమించాలి :బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

విద్యాశాఖ మంత్రిని నియమించాలి :బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

V6 Velugu 1 week ago

కాశీబుగ్గ, వెలుగు: తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని వరంగల్‌ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు డిమాండ్‌ చేశారు.

గురువారం వరంగల్‌ కాశీబుగ్గ అంబేద్కర్​ సర్కిల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ప్రదీప్​ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News