లండన్: వింబుల్డన్‌లో టాప్ సీడ్ ప్లేయర్లు సాఫీగా ముందడగు వేశారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో యానిక్ సినర్ (ఇటలీ) 7-6 (7/4), 7-6 (7/2), 6-4తో నునో బోర్జెస్ (పోర్చుగల్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
ఇతర మ్యాచ్‌ల్లో టొమ్మి పాల్ (అమెరికా) 6-3, 7-6 (7/4), 6-2తో స్నోవు వోన్ (కొరియా)పై, కోబోలి (ఇటలీ) 1-6, 7-6 (7/5), 6-3, 7-6 (10/8)తో నవోనె (అర్జెంటీనా)పై, మెద్వెదెవ్ (రష్యా) 3-6, 6-3, 7-5, 6-2తో డానియెల్ మెరిడా (స్పెయిన్)పై, తియాఫో (అమెరికా) 7-6 (8/6), 6-1, 4-6, -4తో టెరెన్స్ అట్మానె (ఫ్రాన్స్)పై గెలిచారు.
విమెన్స్ సింగిల్స్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6-1, 7-6 (11/9)తో మెకార్తీ కెస్లర్ (అమెరికా)పై నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో నవోమి ఒసాక (జపాన్) 6-3, 6-2తో గసనోవా (రష్యా)పై, కోకో గాఫ్ (అమెరికా) 6-3, 3-6, 7-6 (10/7)తో సియెరా (అర్జెంటీనా)పై, ముచోవా (చెక్) 6-3, 6-2తో జాంగ్ (చైనా)పై నెగ్గి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు.
మరోవైపు 44 ఏళ్ల వయసులో వింబుల్డన్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన అమెరికా వెటరన్ సెరెనా విలియమ్స్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. 3-6, 7-6 (8/6), 3-6తో మాయా జాయింట్ (ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడింది. పరాజయంపాలైనప్పటికీ గ్యాలరీలో ఉన్న ఇద్దరు కుమార్తెల సాక్షిగా సెరెనా సాగించిన పోరాటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

