Dailyhunt
కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళకు కీలక పదవి

కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళకు కీలక పదవి

V6 Velugu 4 years ago

కెనడా ప్రభుత్వంలో భారత సంతతి మహిళకు కీలక పదవి

V6 Velugu Posted on Oct 27, 2021

కెనడా క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ఎంతో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ ను నియమించారు. ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగారు. అయితే.. సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన వైఖరి పట్ల విమర్శలు వచ్చాయి. దాంతో ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించి ..ఆ బాధ్యతలు 54 ఏళ్ల అనితా ఆనంద్ కు అప్పగించారు. సజ్జన్ ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖకు బదిలీ చేశారు.

అనితా ఆనంద్ కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ ఇటీవలే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. కార్పొరేట్ లాయర్ గా కెరీర్ ను ప్రారంభించిన అనిత రాజకీయాల్లోనూ గుర్తింపు పొందారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజా సేవల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు.

కెనడాలో రక్షణ శాఖ మంత్రులుగా ఇప్పటివరకు ఎక్కువశాతం పురుషులే ఉన్నారు. రక్షణ శాఖకు మంత్రిగా వ్యవహరించిన మహిళల్లో అనితా ఆనంద్ రెండోవారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News