Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
10 కొత్త మోడళ్లను ఆవిష్కరించిన హోండా..!

10 కొత్త మోడళ్లను ఆవిష్కరించిన హోండా..!

వార్త 1 week ago

Honda Bikes : భారత ద్విచక్ర వాహన మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఏకంగా 10 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది.

ఇందులో కొత్త మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోడళ్లు, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలతో పాటు ఇప్పటికే ఉన్న కొన్ని మోడళ్లకు కొత్త అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. ఈ Honda Bikes కొత్త లైనప్‌ను దశలవారీగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త రంగులు, అప్‌డేట్స్‌తో రిఫ్రెష్ :

హోండా పరిచయం చేసిన ప్రధాన మోడళ్లలో ADV 160, CB500, Rebel 300, Rebel 500, XR300L, XR300 Rally, QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. అలాగే CB350, CB350 H’ness, CB350RS మోడళ్లను కొత్త రంగులు, అప్‌డేట్స్‌తో రిఫ్రెష్ చేసింది. ఈ విధంగా మొత్తం 10 మోడళ్లతో హోండా వినియోగదారుల ముందుకు వచ్చింది.

ఈ కొత్త పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. నగర ప్రయాణాల నుంచి అడ్వెంచర్ రైడింగ్ వరకు అన్ని రకాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ మోడళ్లను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. రాబోయే పండుగల సీజన్‌లో భారత మార్కెట్లో తన వాటాను మరింత పెంచుకోవడమే హోండా లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే ఈ మోడళ్ల ధరలు, విక్రయ తేదీలు, పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ దశలవారీగా ప్రకటించనుంది. భారత మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా హోండా చేపట్టిన ఈ భారీ ఉత్పత్తుల విస్తరణ ఆటోమొబైల్ రంగంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.

రామాయణ ప్రమోషన్స్‌కే రూ.375 కోట్లు..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha