Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్!

వార్త 1 month ago

Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం రూ.

1,000 కోట్ల నిధులను విడుదల చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని బకాయిలను ఒకేసారి క్లియర్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also:TG Supplementary Exams:పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

Telangana Govt:కోర్టు ఆగ్రహంతో కదిలిన యంత్రాంగం

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఇటీవల గౌరవ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులను కేటాయించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది.

చెల్లింపుల పరిమితి పెంపు

భవిష్యత్తులో ఉద్యోగుల క్లెయిమ్‌లు, బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా చేసే చెల్లింపుల పరిమితిని అదనంగా మరో రూ. 1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయించింది. దీనివల్ల ఇకపై రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, ఇతర క్లెయిమ్‌లు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఉద్యోగ విరమణ చేసిన వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తాజా చర్యలతో బిల్లుల చెల్లింపు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టీఆర్ఎస్ పేరు నాదే.. ఈసీకి తుపాకుల బాలరంగం లేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha