Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్

వార్త 3 weeks ago

KTR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, కేవలం అక్రమ అరెస్టులు చేయడం మాత్రమే ఆ పార్టీ సాధించిన ఘనతగా మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు.

డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ అరెస్టులు

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌ను ఆశ్రయిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుండి మళ్లించేందుకు ప్రతిపక్ష నేతలపై అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడికి దిగిన దుండగులపై మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన తీవ్రంగా నిలదీశారు.

KTR: 420 హామీలపై కేటీఆర్ బహిరంగ సవాల్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు మొత్తం 420 హామీలను పూర్తిగా అమలు చేశారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. దమ్ముంటే ఆ హామీలన్నింటినీ అమలు చేసి చూపించాలని, ఒకవేళ నిజంగానే అమలు చేసి ఉంటే తాము ఎలాంటి అరెస్టులకైనా, విచారణకైనా సిద్ధమేనంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.

ఈరోజైన సభకు సురేఖ వెళ్తారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha