Kalvakuntla Kavitha: మొయినాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత , అనంతరం డాక్టర్ బి . ఆర్ . అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని భావించినా, అనేక లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని ఆమె అన్నారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Read Also: TG EdCET 2026 Results:తెలంగాణ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే!
The goal is to repeal 111 Jivo.. and implement it as soon as we come to power: Kavitha
Kalvakuntla Kavitha: రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతు
మొయినాబాద్, చేవెళ్ల ప్రాంతాలతో పాటు 120 గ్రామాలకు సంబంధించిన 111 జీవో కారణంగా రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 111 జీవోను రద్దు చేసి రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో భూముల విలువ భారీగా పెరిగినప్పటికీ జీవో కారణంగా ప్రజలు ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోతున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ రంగాన్నే దెబ్బతీసిందని విమర్శించారు. రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రక్షణ సేనలో మైనారిటీల చేరిక పెరుగుతోందని, వారి రాకతో పార్టీ మరింత బలపడిందని చెప్పారు. తెలంగాణలో గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిని దెబ్బతీయాలని ప్రయత్నించే శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసిన కవిత, మహిళా సాధికారత కోసం తాను రాజకీయ పార్టీని స్థాపించానని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

