Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1.3 కోట్ల మంది విద్యార్థులు.. ఒక్క పేపర్ కూడా లీక్ అవ్వదు! ఎలా?

1.3 కోట్ల మంది విద్యార్థులు.. ఒక్క పేపర్ కూడా లీక్ అవ్వదు! ఎలా?

వార్త 1 week ago

China Gaokao exam : భారత్‌లో నీట్ పరీక్షా పత్రం లీకేజీ కలకలం రేపుతున్న వేళ, చైనాలో నిర్వహించే 'గౌకావో' (Gaokao) పరీక్షా విధానం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

సుమారు 1.3 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి రాసే ఈ పరీక్షలో ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. ఈ పరీక్షా పత్రాలను చైనా ‘జాతీయ రహస్యాలు’గా పరిగణించడం విశేషం.

జైళ్లలో ముద్రణ.. నిరంతర నిఘా

గౌకావో ప్రశ్నపత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో జరుగుతుంది. బయటి ప్రపంచంతో సంబంధం లేని ఖైదీల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ముద్రించిన పత్రాలను జీపీఎస్ ట్రాకింగ్ మరియు నిరంతర వీడియో నిఘా మధ్య పోలీసు బలగాలు పరీక్షా కేంద్రాలకు తరలిస్తాయి. రవాణా సమయంలో ప్రతి అడుగును భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తారు.

Read Also: Donald Trump Xi Jinping Meeting: జిన్‌పింగ్ నా మిత్రుడు.. అద్భుతమైన నాయకుడు: ట్రంప్

 China Gaokao exam

ఏఐ నిఘా మరియు కఠిన చట్టాలు

పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లు, స్మార్ట్ పరికరాలను గుర్తించే అడ్వాన్స్‌డ్ గేట్లు ఏర్పాటు చేస్తారు. అక్రమాలను అడ్డుకునేందుకు డ్రోన్లు మరియు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగిస్తారు. పరీక్షకు ఆటంకం కలగకుండా విమానాల దారిని మళ్లించడం, ట్రాఫిక్‌ను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటారు. ఎవరైనా లీకేజీకి పాల్పడితే అక్కడి చట్టాలు విధించే శిక్షలు అత్యంత కఠినంగా ఉండటమే ఈ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha