Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్

130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్

వార్త 2 months ago

CM Vijay Car Driving : తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ సరికొత్త ఒరవడితో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

అక్కడ ప్రత్యేక పూజలు, దర్శనం ముగించుకున్న అనంతరం, ఆయన సాధారణ వీఐపీలలా వెనుక సీట్లో కూర్చోకుండా తానే స్వయంగా స్టీరింగ్ చేతబట్టారు. కొల్లూరు క్షేత్రం నుండి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (ఎయిర్‌పోర్ట్) వరకు దాదాపు 130 కిలోమీటర్ల మేర ఆయనే సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లడం విశేషం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత దూరం స్వయంగా డ్రైవ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Read Also : మంగళూరులో శ్రీ మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్న సీఎం విజయ్

కాన్వాయ్‌తో కలిసి డ్రైవింగ్ - ‘విజయ్ రూటే సెపరేట్’ అంటున్న ఫ్యాన్స్

ముఖ్యమంత్రి విజయ్ కారు నడుపుతుండగా, భద్రతా సిబ్బందికి చెందిన కాన్వాయ్ వాహనాలు ఆయనను అనుసరించాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఒక టోల్ గేట్ వద్ద కారు ఆగినప్పుడు, పక్కనే ఉన్న అభిమానులను గమనించిన విజయ్.. ఎంతో నమ్మకంతో, చిరునవ్వుతో వారికి చేయి ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ సూటు, బూటు ధరించి స్టైలిష్‌గా ఉంటూ, ఇటు రాజకీయాల్లోనూ, అటు వ్యక్తిగత జీవితంలోనూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించే విజయ్ నిజంగానే ‘రూటే సెపరేట్’ అని ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎల్‌నినో ఎంట్రీ రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha