Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
18 ఏళ్ల తర్వాత ఉద్యోగం.. కానీ చేరలేని పరిస్థితి!

18 ఏళ్ల తర్వాత ఉద్యోగం.. కానీ చేరలేని పరిస్థితి!

వార్త 2 weeks ago

Kerala PSC : కేరళలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్ల పాటు ఎదురుచూసిన వ్యక్తికి, ఉద్యోగ విరమణ వయసు దాటిన తర్వాత నియామక పత్రం అందింది.

మలప్పురం జిల్లాకు చెందిన అబ్దుల్ మజీద్‌కు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 18 ఏళ్ల తర్వాత ఉద్యోగ ఉత్తర్వులు రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం వస్తే ఆనందపడాల్సిన సమయంలో, ఆయన మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు.

2005లో పరీక్ష.. 2023లో నియామక ఉత్తర్వు

అబ్దుల్ మజీద్ 2005లో పార్ట్‌టైమ్ జూనియర్ అరబిక్ టీచర్ పోస్టు కోసం నిర్వహించిన పరీక్షలో పాల్గొన్నారు. అనంతరం విడుదలైన ర్యాంక్ జాబితాలో ఆయన పేరు కూడా చోటు దక్కించుకుంది. అయితే ఆ జాబితా గడువు 2008లో ముగియడంతో ఉద్యోగంపై ఆశలు వదులుకున్నారు. కానీ ఇటీవల అనూహ్యంగా కేరళ పీఎస్‌సీ నుంచి ఆయనకు నియామక ఉత్తర్వు అందింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

Read Also:TOSS SSC Inter Results 2026:టాస్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

 Kerala PSC

అర్హత కోల్పోయిన అభ్యర్థి

ఈ పోస్టుకు సంబంధించి పలుమార్లు నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ అర్హులైన అభ్యర్థులు లభించకపోవడంతో అధికారులు పాత రికార్డులను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆ ప్రక్రియలో మజీద్ పేరును గుర్తించి నియామక పత్రం పంపించారు. అయితే అప్పటికే ఆయన వయసు ఉద్యోగంలో చేరేందుకు అనుమతించే పరిమితిని దాటిపోయింది.

నిబంధనల ప్రకారం నియామక పత్రం అందుకున్న తర్వాత నిర్ణీత గడువులో ఉద్యోగంలో చేరాలి. కానీ మజీద్ జనన తేదీ 1966 మే 27 కావడంతో ప్రస్తుతం ఆయన పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. దీంతో సాంకేతికంగా ఉద్యోగంలో చేరే అర్హత లేకుండా పోయింది. “ప్రభుత్వ ఉద్యోగం నా జీవితకాల కల. కానీ అది నెరవేరడానికి 18 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆ లేఖ నాకు ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేకపోయింది” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన కల చేతికొచ్చినట్టే వచ్చి జారిపోవడం ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha