Dailyhunt
180 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్!

180 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. వీడియోలతో బ్లాక్ మెయిల్!

వార్త 1 week ago

Maharashtra Crime: మహారాష్ట్రలో ఒక కిరాతకుడు మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని చేసిన అరాచకాలు విచారణలో బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగుతోంది.

నిందితుడు మహమ్మద్ అయాజ్ దాదాపు 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా అమాయక బాలికలకు ఎర వేసి, వారిని మాయమాటలతో లోబరుచుకోవడం ఇతడి శైలి. ఒకప్పుడు రాజకీయ పార్టీలో బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Read Also:Pudi Srihari Arrest: వైసీపీ సోషల్ మీడియా నేత పూడి శ్రీహరి అరెస్ట్

 Trafficking in Obscene Videos of Girls? A Case Rocking Maharashtra.

Maharashtra Crime: వీడియోలతో బ్లాక్ మెయిల్.. ఏడు రోజుల పోలీస్ కస్టడీ

నిందితుడు కేవలం వేధించడమే కాకుండా, బాలికలకు తెలియకుండా సుమారు 350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని బాధిత బాలికలను బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే తన లైంగిక వాంఛలు తీర్చుకునేవాడని సమాచారం. అంతేకాకుండా, కొన్ని వీడియోలను ఆన్‌లైన్‌లో ఇతరులకు షేర్ చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకున్నారు.. కానీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha