Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్!

2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ రైలుకు గ్రీన్ సిగ్నల్!

వార్త 3 months ago

First bullet train: దక్షిణ భారతదేశ రవాణా కు ఒక అద్భుతమైన మెగా ప్రాజెక్టుకు కర్ణాటక ప్రభుత్వం పరిపాలనా ఆమోదం మంజూరు చేసింది. ఐటీ, పారిశ్రామిక హబ్‌లుగా వెలుగొందుతున్న బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలను అనుసంధానిస్తూ ప్రతిపాదించిన హై-స్పీడ్ రైలు (బుల్లెట్ రైలు) కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా, దక్షిణభారతపు మొట్టమొదటి బుల్లెట్ రైలు నెట్‌వర్క్ నిర్మాణ దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది.

Read Also : TVK: విజయ్ టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు: డీఎంకే ఎమ్మెల్యే

 Green signal for Hyderabad to Bangalore bullet train within 2 hours!

First bullet train: బెంగళూరు – చెన్నై.. గంటా 15 నిమిషాల ప్రయాణం

హైదరాబాద్-బెంగళూరు హై-స్పీడ్ రైలు కారిడార్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మరియు కర్ణాటక రాష్ట్రాల గుండా సాగే ఈ మార్గంలో దాదాపు 101 కిలోమీటర్ల భాగం కర్ణాటక పరిధిలోకి వస్తుంది. ఈ లైన్ తుమకూరు, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్ జిల్లాల్లోని కొన్ని కీలక ప్రాంతాల మీదుగా వెళుతుంది. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకోవడానికి ఎనిమిది నుండి పన్నెండు గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. అయితే, ఈ సరికొత్త బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే, ఈ ప్రయాణ సమయం కేవలం రెండు గంటల పది నిమిషాలకు తగ్గిపోవడం ఒక అద్భుతమనే చెప్పాలి. నిరంతరాయంగా అత్యధిక వేగంతో రైళ్లను నడపడం కోసం ఈ మార్గాన్ని పూర్తిగా ఎలివేటెడ్ (పైవంతెన) పద్ధతిలో నిర్మించనున్నారు. ఇందులో కోడిహళ్లి, అలీపూర్, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అత్యాధునిక స్టేషన్లను నిర్మించనున్నారు.

మరోవైపు మైసూరు, బెంగళూరు, చెన్నై నగరాలను కలుపుతూ 435 నుండి 463 కిలోమీటర్ల పరిధిలో రెండవ హై-స్పీడ్ కారిడార్‌ను ప్రతిపాదించారు. ఇందులో కేవలం చెన్నై-బెంగళూరు మార్గమే దాదాపు 306 మైళ్ల మేర విస్తరించి ఉంటుంది. ఈ రెండు భారీ కారిడార్ల నిర్మాణంలో హోస్కోట్ తాలూకాలోని ‘కోడిహళ్లి’ గ్రామం అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా మారబోతోంది. హైదరాబాద్, చెన్నై వైపు వెళ్లే బుల్లెట్ రైలు పట్టాలు ఇక్కడే కేంద్రీకృతం కానుండటంతో, కోడిహళ్లి ఒక ప్రధాన ఇంటర్‌చేంజ్ జంక్షన్‌గా అవతరించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

యూఏఈలోని బరకా అణు కేంద్రంపై డ్రోన్ దాడిని ఖండించిన భారత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha