Plastic Currency Notes : దేశీయ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా 2027 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల మన్నిక, భద్రత చాలా ఎక్కువని ఆయన స్పష్టం చేశారు. విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో, నిత్యం వాడే కఠిన పరిస్థితుల్లో ఈ నోట్ల మన్నికను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరీక్షించనున్నట్లు తెలిపారు. అంతా ప్రణాళిక ప్రకారం సాగితే రాబోయే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2027) ప్రారంభం నుంచే ఈ ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.

సుదీర్ఘ జీవితకాలం – నకిలీ నోట్లకు చెక్: పాలిమర్ నోట్ల ఉపయోగాలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 ఏళ్ల క్రితమే అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో పాలిమర్ నోట్ల వాడకం విజయవంతంగా ప్రారంభమైందని, కాగితపు నోట్ల కంటే వీటి జీవితకాలం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ అని గవర్నర్ వివరించారు. ప్లాస్టిక్ నోట్లు నీటిలో నానవు, త్వరగా చిరిగిపోవు మరియు మురికి కాకుండా ఎక్కువ కాలం కొత్తవిగా ఉంటాయి. వీటి తయారీకి అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఉపయోగించడం వల్ల నకిలీ (ఫేక్) కరెన్సీ చలామణిని పూర్తిగా అరికట్టవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పాత నోట్లను తరచూ రద్దు చేసి కొత్తవి ముద్రించే వ్యయం ఆర్‌బీఐకి గణనీయంగా తగ్గడమే కాకుండా, స్వచ్ఛమైన మరియు అత్యంత భద్రమైన కరెన్సీ నోట్లను ప్రజలకు అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం.. తమిళనాడు ప్రభుత్వం

