Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2028కల్లా ఇండియన్ బ్రాండెడ్ ఫోన్లు - కేంద్రమంత్రి హామీ

2028కల్లా ఇండియన్ బ్రాండెడ్ ఫోన్లు - కేంద్రమంత్రి హామీ

వార్త 23 hrs ago

Indian-Branded Phones : భారతదేశంలోనే పూర్తి స్థాయిలో డిజైన్ చేసి తయారు చేసిన 'ఇండియన్ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను' 2028 అక్టోబర్ 23 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర సమాచార సాంకేతిక మరియు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ ఇచ్చారు.

'NDTV వరల్డ్ సమ్మిట్'లో ప్రసంగించిన ఆయన, భారత్ కేవలం విదేశీ బ్రాండ్ల ఫోన్లను అసెంబుల్ చేసే దేశంగా కాకుండా, సొంత సాంకేతికత మరియు బ్రాండింగ్‌తో గ్లోబల్ మార్కెట్‌లో నిలిచే స్థాయికి ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను ఏలబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

 Ashwini Vaishnav

సెమీకండక్టర్ రంగంలో భారత్ ప్రగతి & మోదీ నాయకత్వం

దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతుండగా, 1962 నాటి నుంచే భారత్‌ను సెమీకండక్టర్ హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే అవి కార్యరూపం దాల్చి విజయం సాధించాయని మంత్రి గుర్తుచేశారు. మనం నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దాదాపు 75 శాతం చిప్స్ 28 నానోమీటర్ల నుండి 19 నానోమీటర్ల పరిమాణంలోనే ఉంటాయని, ఈ రకమైన చిప్‌ల తయారీలో భారత్ వేగంగా పురోగతి సాధిస్తోందని వెల్లడించారు. సెమీకండక్టర్ తయారీతో పాటు స్వదేశీ బ్రాండ్ల మొబైల్ రంగం కూడా బలోపేతం కావడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఉత్సాహం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

SIRకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనకారుల నిరసన ప్రదర్శన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha