Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2036 ఒలింపిక్స్ రేసులో భారత్: ఎర్రకోట వేదికగా మోదీ కీలక ప్రకటన!

2036 ఒలింపిక్స్ రేసులో భారత్: ఎర్రకోట వేదికగా మోదీ కీలక ప్రకటన!

వార్త 1 week ago

Independence Day 2026: భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ క్రీడా రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ అత్యంత బలమైన పోటీదారుగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లో భారత్ తన బలమైన ఉనికిని చాటుకునేలా, 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గ్రామీణ స్థాయి నుంచే గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక అన్వేషణ కార్యక్రమాన్ని (Talent Hunt) ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.

Read Also :Cristiano Ronaldo : పెళ్లికి ముందే ఆస్తులపై రొనాల్డో, జార్జినా డీల్..!

Independence Day 2026: ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • గ్లోబల్ స్పోర్ట్స్ వేదికపై భారత్: "నేడు అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో భారత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. విదేశీ గడ్డపై జరిగే ప్రతి అంతర్జాతీయ పోటీలోనూ భారత జాతీయ గీతం గర్వంగా వినిపిస్తోంది."
  • TOPS & ఖేలో ఇండియా విజయం: 'టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్' (TOPS) మరియు 'ఖేలో ఇండియా' (Khelo India) వంటి పథకాలు క్రీడాకారులకు అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందించాయని, క్రీడా శిక్షణతో పాటు 'స్పోర్ట్స్ మెడిసిన్' విభాగంలోనూ యువతకు గొప్ప అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
  • గ్రామీణ స్థాయిలో టాలెంట్ హంట్: రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా 5 నుండి 15 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతిభావంతులైన పిల్లలను ఎంపిక చేసి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

డబ్ల్యూటీసీ ఫైనలే మా ప్రధాన లక్ష్యం: టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha