గతేడాది మే నెలలో భారత సైన్యం అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక విషయాలను వెల్లడించారు.
2025 మే 6, 7 తేదీల మధ్య రాత్రి కేవలం 22 నిమిషాల్లోనే శత్రుదేశంపై అత్యంత కచ్చితత్వంతో దాడులు పూర్తి చేశామని ఆయన ప్రకటించారు. ఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ ల్యాండ్ వార్‌ఫేర్ స్టడీస్’ (CLAWS) నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగిస్తూ భారత్ చాటిన ‘స్మార్ట్ పవర్’ గురించి వివరించారు.
Read Also: Stray Dogs Issue: వీధికుక్కల ముప్పుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Operation Sindoor
Operation Sindoor: ఏంటి ఈ ‘ఆపరేషన్ సిందూర్’?
జనరల్ ఉపేంద్ర ద్వివేది కథనం ప్రకారం, ఆపరేషన్ సిందూర్ అనేది ఒక సాధారణ సైనిక చర్య కాదు. అది భారతదేశపు సమగ్ర జాతీయ శక్తికి నిదర్శనం. ఉగ్రవాద మౌలిక సదుపాయాల ధ్వంసం. పాకిస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను, మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ దారుణంగా దెబ్బతీసింది. మొత్తం 88 గంటల పాటు సాగిన ఈ వ్యూహాత్మక కదలికల అనంతరం, ప్రణాళికాబద్ధంగా భారత్ ఈ ఆపరేషన్‌ను నిలిపివేసింది. సైనిక చర్యను ఎప్పుడు ఆపాలో తెలిసిన శౌర్యం భారత సేనల సొంతమని ఆర్మీ చీఫ్ కొనియాడారు. సైనికపరమైన కచ్చితత్వం, సమాచార నియంత్రణ, దౌత్య సంకేతాలు, మరియు ఆర్థిక సంకల్పాన్ని కలగలిపి భారత్ ప్రపంచానికి ఒక కొత్త పాఠం నేర్పిందని ఆయన అన్నారు.
వనరుల కోసం ప్రపంచ దేశాల ‘పవర్ పాలిటిక్స్’
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వ్యాపారాలు, ప్రపంచీకరణ వల్ల యుద్ధాలు రావని భావించేవారని, కానీ నేడు ఆ నమ్మకం అబద్ధమైందని అన్నారు. కొన్ని దేశాలు తమ సైనిక, రాజకీయ బలంతో ఎదుటి దేశాల సంపదను, వ్యాపారాలను లాక్కోవడానికి ‘పవర్ పాలిటిక్స్’ చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది దేశాల మధ్య అవిశ్వాసాన్ని, కూటముల మధ్య వైరుధ్యాలను పెంచుతోందని విశ్లేషించారు. ఇరవై ఒకటో శతాబ్దం ప్రారంభంలో దేశాలను అనుసంధానిస్తాయని భావించిన వాణిజ్యం, సప్లై చైన్‌లు ఇప్పుడు బలవంతపు చర్యలకు సాధనాలుగా మారాయని జనరల్ ద్వివేది పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

