SIR Notices : ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ చేపట్టనున్నారు.
నోటీసుల జనరేషన్, ప్రింటింగ్ ప్రక్రియ ఈ నెల 31 నాటికి పూర్తి కానుంది. ఈ మేరకు నోటీసుల షెడ్యూల్, ముద్రణ, పంపిణీ, ఓటర్ల విచారణపై సీఈవో కార్యాలయం తాజాగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
Read Also: Tarun Tejpal: తేహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంలో షాక్
SIR Notices
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..
సర్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడంతో నోటీసులు అందుకునే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఈఆర్వో, బీఎల్వోలకు సంబంధిత సూచనలను పాటించాలంటూ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా తెలియజేశారు. మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలను ఓటర్లకు స్పష్టంగా వివరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
నోటీసులు ఎందుకు జారీ చేశారు?
ఓటర్ల విచారణ తేదీకి 48 గంటల్లోపే స్లిప్‌లను ముద్రించి బీఎల్‌వోల ద్వారా పంపిణీ చేసి ఆ వివరాలను యాప్‌లో నమోదు చేయాలి. నోటీసులు ఎందుకు జారీ చేశారు? విచారణకు ఏ తేదీన, ఎక్కడ హాజరు కావాలి? ధ్రువపత్రాలు ఏం తీసుకురావాలి తదితర వివరాలను ఓటర్లకు బీఎల్వోలు స్పష్టంగా వివరించాలి. ఓటర్లు తమ ధ్రువపత్రాలను 3 వేదికల ద్వారా సమర్పించవచ్చు. ఓటరు పోర్టల్, బీఎల్‌వో యాప్, విచారణ సమయంలో నేరుగా హాజరై ఇవ్వొచ్చు.
Epaper: epaper.vaartha.com

