Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
27 ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ రద్దు

27 ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ రద్దు

వార్త 8 hrs ago

Telangana Junior Colleges: రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పాటించని మరియు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇంటర్మీడియట్ విద్యామండలి కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ సరైన అనుమతులు లేని, నిబంధనలు విస్మరించిన మొత్తం 27 జూనియర్ కాలేజీలకు గుర్తింపును నిరాకరించింది.

జీరో అడ్మిషన్ కాలేజీలుగా ప్రకటన

అనుమతులు కోల్పోయిన ఈ విద్యాసంస్థలను ‘జీరో అడ్మిషన్’ కాలేజీలుగా ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్‌లో మొట్టమొదటి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చేరిన ఏ కాలేజీలోనూ కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాలు చేపట్టడానికి బోర్డు స్పష్టం చేసింది.

Telangana Junior Colleges: జిల్లాల వారీగా గుర్తింపు కోల్పోయిన కాలేజీల వివరాలు

అధికారిక గణాంకాల ప్రకారం, గుర్తింపు కోల్పోయిన కాలేజీలు ప్రధానంగా ప్రధాన నగరాల పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 కాలేజీలు ఈ జాబితాలో ఉండగా, మేడ్చల్ జిల్లాలో 7 కాలేజీలు, హైదరాబాద్ పరిధిలో మరో 6 కాలేజీలు గుర్తింపును కోల్పోయినట్లు బోర్డు వెల్లడించింది.

ప్రముఖ కార్పొరేట్ సంస్థల బ్రాంచీలు కూడా జాబితాలో..

ఈ జాబితాలో కేవలం చిన్న స్థాయి కళాశాలలే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్న కొన్ని ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన బ్రాంచీలు సైతం ఉండటం గమనార్హం. నిబంధనల అమలులో విఫలమవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక సూచన

కొత్త విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాము ఎంచుకునే కాలేజీకి ఇంటర్ బోర్డు అధికారిక గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని బోర్డు వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకున్న తర్వాతే ప్రవేశాలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

పేదలకు గుడ్‌న్యూస్‌.. మే వరకు ప్రత్యేక ఉపాధి పథకం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha