SRH vs LSG match updates: సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోవడంలో హైదరాబాద్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
ఇప్పటికే స్టార్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పెవిలియన్ చేరగా, తాజాగా ఇషాన్ కిషన్ కూడా కేవలం 1 పరుగు (4 బంతులు) మాత్రమే చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టేడియంలోని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
Read Also:SRH vs LSG match updates: షమీ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ అవుట్!

SRH vs LSG match updatesషమీ నిప్పులు చెరిగే బౌలింగ్.. 11 పరుగులకే 3 వికెట్లు!
లక్నో పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కేవలం 2 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి హైదరాబాద్ నడ్డి విరిచాడు. మరోవైపు ప్రిన్స్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్‌ను అవుట్ చేసి మూడో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం 3.3 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 11/3గా ఉంది. క్రీజులో ఉన్న లియామ్ లివింగ్‌స్టోన్ (2 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

