Dailyhunt
34 ఏళ్ల తర్వాత అదే గ్రేస్.. అదే మ్యాజిక్

34 ఏళ్ల తర్వాత అదే గ్రేస్.. అదే మ్యాజిక్

వార్త 6 days ago

Meenakshi Seshadri Dance Video: నేటి టెక్నాలజీ యుగంలో పాత జ్ఞాపకాలను మళ్లీ వెలికితీసి 'రీ-క్రియేట్' చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్, 80, 90వ దశకంలో భారతీయ సినీ రంగంలో 'డ్యాన్సింగ్ క్వీన్'గా వెలిగిన మీనాక్షి శేషాద్రి తాజాగా చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

మూడు దశాబ్దాల క్రితం తాను చేసిన అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌ను 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా అదే గ్రేస్‌తో మళ్లీ చేసి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Read Also:Tamannaah: ఫోటోల వివాదం.. పవర్ సోప్స్ సంస్థపై తమన్నా అప్పీల్ తోసిపుచ్చిన కోర్టు!

Meenakshi Seshadri Dance Video: 'ఆపద్బాంధవుడు' మ్యాజిక్ రిపీట్

మెగాస్టార్ చిరంజీవి, కళాతపస్వి కె. విశ్వనాథ్ కలయికలో వచ్చిన క్లాసికల్ మాస్టర్ పీస్ 'ఆపద్బాంధవుడు' (1992). ఈ సినిమాలో మీనాక్షి శేషాద్రి తన నటనతో పాటు శాస్త్రీయ నృత్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని "అవురా అమ్మక చెల్లా" అనే పాట ఒక ఆణిముత్యం. కులు మనాలి మంచు కొండల నేపథ్యంలో ఆమె చేసిన నృత్యం అప్పట్లో ఒక సంచలనం. ఇప్పుడు సరిగ్గా 34 ఏళ్ల తర్వాత ఆమె అదే పాటను రీ-క్రియేట్ చేయడం విశేషం.

ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడిన మీనాక్షి, అక్కడ ' Cherish Institute of Dance ' అనే సంస్థను నడుపుతూ భావితరాలకు భారతీయ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. తాజాగా తన డ్యాన్స్ స్కూల్ విద్యార్థులతో కలిసి "అవురా అమ్మక చెల్లా" పాటకు ఆమె స్టెప్పులు వేశారు. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. 62 ఏళ్ల వయసులో కూడా ఆమె ముఖంలో అదే ఎక్స్‌ప్రెషన్స్, శరీరంలో అదే గ్రేస్ చూస్తుంటే వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు. "అప్పటికి ఇప్పటికీ మీనాక్షిలో ఏమాత్రం మార్పు రాలేదు.. కేవలం కాలం మాత్రమే మారింది" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నెట్‌ఫ్లిక్స్‌లో 'యూత్' మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha