Ankam Rahul Missing case:జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ మృతదేహం కోసం తల్లిదండ్రులు గత 35 రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్ సైదాబాద్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న రాహుల్, మే 27న టూర్‌కు వెళ్తానని చెప్పి బయలుదేరాడు. ఏపీలోని సింగరాయకొండ సమీపంలోని బావిలో రాహుల్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడని పోలీసుల ద్వారా తెలియడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. కొడుకు చనిపోయి నెల దాటినా, మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడంలో జాప్యం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read also: CM Revanth 20 Years Politics:ప్రజా జీవితంలో 20 ఏళ్లు.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్
Protest for Ankam Rahul’s body
సింగరాయకొండ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం
మే 27న కాచిగూడలో ఎంఎంటీఎస్ రైలు ఎక్కిన రాహుల్, సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు పరిధిలోని సింగరాయకొండ చేరుకున్నాడు. అక్కడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా భావించారు. మే 30న గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన పోలీసులు, మే 31న మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఈ ఘటన వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడంలోనూ, మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించడంలోనూ సింగరాయకొండ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అసలు రాహుల్ ఎలా మరణించాడో తెలియక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు.
Ankam Rahul Missing case:రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనలకు హెచ్చరిక
రాహుల్ మరణంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే మృతదేహాన్ని స్వరాష్ట్రానికి తరలించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంత కాలం గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చొరవ చూపకపోతే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అయినా చూడనివ్వాలని రాహుల్ తల్లిదండ్రులు ప్రభుత్వం ముందు మొరపెట్టుకుంటున్నారు.
Epaper: epaper.vaartha.com
క్రిస్టియన్ మైనారిటీలకు శుభవార్త.. ఉచిత కుట్టు మిషన్, ఈ-బైక్స్, స్కూటీలు

