Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
40 ఏళ్లుగా పెరోల్‌పై పరారీ: ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన జీవిత ఖైదీ

40 ఏళ్లుగా పెరోల్‌పై పరారీ: ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన జీవిత ఖైదీ

వార్త 3 weeks ago

Parole Life Convict Evading 40 Years : పెరోల్‌పై బయటకు వచ్చి 40 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పించుకోవడమే కాకుండా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా పొందిన ఓ జీవిత ఖైదీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది.

ఈ ఘటన జైళ్ల శాఖలోని లోపాలను వేలెత్తి చూపుతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Read Also: Gym Trainer Killed : కాకినాడలో దారుణం: వివాహేతర సంబంధం కారణంగా జిమ్ ట్రైనర్ కిరాతక హత్య!

 Parole Life Convict Evading 40 Years

Parole Life Convict Evading 40 Years : కేసు నేపథ్యం & కోర్టు తీర్పు వివరాలు..

1983లో ఒక హత్య కేసులో నందుల వీరన్న అనే వ్యక్తికి వరంగల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. చంచల్‌గూడ జైలు నుంచి 1983 డిసెంబర్‌లో పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన, 1984 మార్చిలో తిరిగి జైలుకు లొంగిపోకుండా పరారయ్యాడు. తన నేర చరిత్రను దాచిపెట్టి మహబూబాబాద్ ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. మే 16, 2024న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం వీరన్నను అరెస్టు చేసి జైలుకు తరలించింది. హోం శాఖ అతనికి మూడేళ్ల పాటు పెరోల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరన్న భార్య చారమ్మ వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ టి. మాధవీ దేవి, ఖైదీ ఉద్దేశపూర్వకంగానే శిక్ష నుంచి తప్పించుకున్నారని స్పష్టం చేశారు. పెరోల్ నిరాకరణ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. పెరోల్ ముగిసినా తిరిగి రాని ఖైదీల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.

ఐఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని బలవన్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha