Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
400 కొత్త క్యాంటీన్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

400 కొత్త క్యాంటీన్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

వార్త 2 weeks ago

New canteens: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువెందు అధికారి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే క్యాంటీన్లలో రూ.5కే చేప కూర భోజనం అందిస్తున్నామంటూ ప్రకటించారు.

ఓ సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 400 క్యాంటీన్లలో రాయితీ కల్పిస్తూ ఈ భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు సువేందు అధికారి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ లో చేపలు, మాంసం, గుడ్లపై బీజేపీ పూర్తి నిషేధం విధిస్తుందన్న మాటలకు బదులుగా ధీటుగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న వాటికీ ఇలా సమాధానమిచ్చి ఈ ప్రకటన వెల్లడించారు. ఈ చేపల విషయంలో మమత వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలు వారు మాటలు తూటాలను పేల్చారు.

Read Also : Bakrid 2026 Goat Prices: బక్రా మండీల్లో బేరసారాల హోరు..40 శాతం పెరిగిన మేకల ధరలు!

 New canteens

New canteens: బెంగాలీ సంస్కృతి పట్ల అనుబంధం

ఇక ఏప్రిల్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో, ప్రజల ఆహారపు అలవాట్లను ప్రస్తావిస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీని లక్ష్యంగా మాటలను అన్నారు. “బెంగాల్ ప్రజలు ఎక్కువగా చేపలు, అన్నం తిని బతుకుతారు. మీరు ఇప్పుడు ప్రజలకు చేపలు తినకూడదు, మాంసం తినకూడదు, గుడ్లు తినకూడదు అని అంటున్నారు .. మరి ఇక వాళ్ళు ఏం తింటారని?” ప్రశ్నించింది. అయితే, బీజేపీ ఈ తీవ్ర ఆరోపణలను ఖండింస్తూ, తాము అధికారంలోకి వస్తే పార్టీ అలాంటి చర్యలు తీసుకోదని అప్పుడు హామీ ఇచ్చింది. నిజానికి, అనురాగ్ ఠాకూర్‌తో సహా కొందరు బీజేపీ నాయకులు బెంగాలీ సంస్కృతి పట్ల తమకున్న అనుబంధాన్ని చాటుకోవడానికి చేపలు, అన్నం విందులలో పాల్గొనడమే కాకుండా, ఆ నామినేషన్ ర్యాలీల సమయంలో చేపలను కూడా తీసుకుని వెళ్ళారు.

 New canteens

రూ. 5 రాయితీ ధరకే ఆహారం

మేము మాంసం, చేపలు, అన్నం తింటున్నాము. 16 రాష్ట్రాల్లో బీజేపీకి సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. 20 రాష్ట్రాల్లో ఎన్డీఏకు ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడా ఎవరి ప్రసంగంపైనా, ఆహారంపైనా, ఆరాధనపైనా ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ, మమతా బెనర్జీ… భయాన్ని, గందరగోళాన్ని, పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని ఠాకూర్ అన్నారు. బెంగాల్‌లో 5 రూపాయల భోజనాలు : పశ్చిమ బెంగాల్ మొత్తం రూ. 5 రాయితీ ధరకే ఆహారం అందించే క్యాంటీన్లు మంచి పేరు పొందాయి. 2021 ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నాంది పలికిన ఈ క్యాంటీన్లను ‘మా’ క్యాంటీన్ అని పిలుస్తారు. ఇవి ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 నుండి 3:00 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. గత ప్రభుత్వం అన్నం, పప్పు, కూర, గుడ్డు కూరను పెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha