Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్ చేస్తాం తేల్చి చెప్పిన కేజ్రీవాల్

5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్ చేస్తాం తేల్చి చెప్పిన కేజ్రీవాల్

వార్త 3 weeks ago

E20 Petrol : రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారం చేపడితే, గోవాలో 2027 మార్చి 10 తర్వాత కేవలం ఐదు రోజుల్లోనే E20 (ఇథనాల్ బ్లెండెడ్) పెట్రోల్ అమ్మకాలపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు.

ఒకవేళ ఈ హామీని నెరవేర్చకపోతే తాను శాశ్వతంగా రాజకీయం నుంచే తప్పుకుంటానని శపథం చేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం (E20) వల్ల వాహనాల ఇంజిన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఇంధన మైలేజ్ గణనీయంగా తగ్గి వాహనదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

పెరుగుతున్న చక్కెర ధరలు - E20 పెట్రోల్‌పై ఏఏపీ దేశవ్యాప్త పోరాటం

ఇథనాల్ ఇంధన విధానం వల్ల సాధారణ పౌరుల నిత్యవసరాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇథనాల్ తయారీ కోసం చెరకు ఉత్పత్తులను విచ్చలవిడిగా దారి మళ్లించడం వల్లే దేశంలో చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వాహనదారుల ప్రయోజనాలను, సామాన్యుల జేబులను బలితీసుకుంటున్న ఈ E20 ఇంధన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. E20 పెట్రోల్ వినియోగానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్త నిరసన ప్రచారాన్ని (Nationwide Campaign) మరింత ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.

కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. నూతన కమిటీల ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha