AP TET Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
టీఈటీ (TET) అర్హత సాధించిన అభ్యర్థులకు శుభవార్త అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తులకు ఆగస్టు 21 ఆఖరు తేదీ

ఈ నియామకాల ద్వారా మొత్తం 6,534 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 3,597 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనం చెల్లిస్తారు. SGT పోస్టులకు నెలకు రూ.10,000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.12,500 చొప్పున స్టైపెండ్ అందజేయనున్నారు. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు; కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ చేపడతారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 21, 2026వ తేదీలోగా తమ దరఖాస్తులను సంబంధిత మండల విద్యాశాఖాధికారి (MEO) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.

